సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశాలు దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. ఇందులో భారత్-అమెరికా అణు ఒప్పందంపై తాజాగా చెలరేగిన దుమారంపై కీలకంగా చర్చించనున్నారు. అణు ఒప్పందం ముసుగులో కమ్యూనిస్టులను దేశ ద్రోహులుగా చిత్రీకరించాలని యూపీఏ మిత్ర పక్షాలు చేసిన ఆరోపణలను తిప్పికొట్టాలని భావిస్తున్నారు.
అణు ఒప్పందం అమలుకు వస్తే భారత్ అన్ని రకాలుగా తలొగ్గి ఉండాలనే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై స్వదేశీయంగా అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున విమర్శల వర్షం గుప్పించాయి. ఈ నేపథ్యంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సమావేశమైంది.
రాష్ట్రంలో నటుడు చిరంజీవి రాజకీయ పార్టీ ఏర్పాటు, అణు ఒప్పందానికి అణు సరఫరా సభ్య దేశాల కూటమి పచ్చజెండా ఊపితే తదుపరి అనుసరించాల్సిన వ్యూహంపై ఇందులో చర్చించనున్నారు. అలాగే కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి రాష్ట్రంలోనూ ఆందోళనలు నిర్వహించేలా పొలిట్‌బ్యూరో తీర్మానం చేయనున్నారు.
|