ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > అణు మినహాయింపు మూలమలుపు: భారత్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అణు మినహాయింపు మూలమలుపు: భారత్
అంతర్జాతీయ అణు వాణిజ్యం కోసం భారత్‌కు మినహాయింపు ఇస్తూ అణు ఇంధన దేశాలు తీసుకున్న మూకుమ్మడి నిర్ణయం ఒక మూలమలుపుగా భారత్ అభివర్ణించింది. ఎన్ఎస్‌జి దేశాల నిర్ణయం అణు నిరాయుధీకరణ విషయంలో భారత్ చేపట్టిన విశ్వసనీయ వైఖరికి గుర్తింపు అని భారత్ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యానించారు.

అణు ఇంధన సరఫరా వాణిజ్యం కోసం భారత్‌కు ఆమోదం తెలుపుతూ 45 దేశాల అణు సరఫరా బృందం చేసిన ఏకాభిప్రాయ ప్రకటన ముందు చూపుతో తీసుకున్న మేటి నిర్ణయంగా ప్రధాని అభివర్ణించారు.

ఎన్ఎస్‌జి తన ఆమోదం తెలిపిన వెంటనే తాను అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌తో మాట్లాడానని, పౌర అణు ఒప్పందాన్ని ముందుకు తీసుకుపోవడానికి, మరియు భారత్, అంతర్జాతీయ సమాజంతో పూర్తి స్థాయి పౌర అణు సహకారాన్ని ప్రారంభించేందుకోసం, ఆయన చేపట్టిన పాత్రకు ధన్యవాదాలు తెలిపానని ప్రధాని చెప్పారు.
మరిన్ని
'అణు' పరిణామాలపై సీపీఎం చర్చ
కేంద్రాన్ని నిధులు కోరిన పుదుచ్చేరి ప్రభుత్వం
త్వరలో జనతాదళ్ (ఎస్) అభ్యర్థుల జాబితా
భారత్, పాకిస్తాన్‌లలో స్వల్ప భూకంపం
తిరుచ్చికి 2,975 టన్నుల ఎరువుల కేటాయింపు
నేడు కూడా కొనసాగనున్న సింగూర్ చర్చలు