బీహార్ వరద బాధితులు నయీదునియా సహాయ నిధి ప్రకృతి వైపరీత్యం భూకంపాలు భారీ వర్షాలు విరాళాలు పన్ను రాయితీ కరువు కాటకాల సమయంలో ఎన్నటికీ దెబ్బతినకుండా ఉండేది మానవత్వమే. ఇది ఒక నిరూపిత సత్యం. భూకంపాలు, విధ్వంసం సృష్టించే పెను వరదలు, భారీ వర్షాల కారణంగా సంభవించే విపత్తు వంటి సంక్షోభ సమయాల్లో, ఈ విధ్వంసాలను ధైర్య సాహసాలతో ఎదుర్కొనేందుకు వ్యక్తి అంతర్వాణి అతడికి ఆమెకు ఎల్లప్పుడూ దోహదపడుతుంది. అదే పరస్పరం సహకరించుకుని మద్దతు ఇచ్చిపుచ్చుకుంటే విధ్వంసం జరిగిన తర్వాత సంభవించే దుష్ప్రభావాలను ఎదుర్కోవడం చాలా సులభమవుతుంది.
ఈ సారి కూడా విధ్వంసకరమైన ప్రకృతి వైపరీత్యం జాతిని పట్టి ఊపేసింది. బీహార్ ప్రజలు తమ జీవితాలకోసం పోరాడుతున్నారు. ముంచుకొచ్చిన వరద తాకిడికి లక్షలాది మంది ప్రజలు విలవిల్లాడిపోయారు. వీరిలో అనేకమంది ఇళ్లు కోల్పోయారు. ఈ దఫా వరద తాకిడి ఎంత బలంగా తాకిందంటే అసంఖ్యాక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోవడమే కాక సమీప భవిష్యత్తులో కోలుకోలేనంత నష్టం సంభవించింది. ప్రజలకు సంబంధించిన సమస్తమూ వరదలో కొట్టుకుపోయిందంటే అతిశయోక్తి కాదు.
బాధాకరమైన విషయం ఏమిటంటే బాధితుల్లో అనేకమంది పిల్లలు. నిస్సహాయ పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఈ ప్రజల జీవితాల్లో ఆవరించిన పెను విషాదాన్ని తొలగించాలంటే వీరికి తప్పనిసరిగా సహాయం చేయవలిసి ఉంది. దిక్కు లేని పరిస్థితుల్లో ఎదురు చూస్తున్న ఈ బాధితులను మనం ఆదుకుని వారి బాధలు మనం ఎందుకు పంచుకోకూడదు మరి.. చేయీ చేయీ కలిపి వరద బారినపడ్డ వారి జీవితాలకు సహకరిద్దాం పదండి.
వినాయక చవితి పండుగను జరుపుకుంటున్న శుభ సందర్భంగా విఘ్నేశ్వరుడు సమస్త బాధలను, దుఃఖాలను తొలగిస్తాడని మన విశ్వాసం.
మీరు "నయాదునియా వరద సహాయ నిధి" ద్వారా కూడా బీహార్ ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నించవచ్చు. వెబ్ దునియా సంస్థ నయాదునియా గ్రూప్‌లో భాగమని మీకు తెలుసు. మీరు బీహార్ వరద బాధితులకు సహాయం చేయాలని భావిస్తే, ఉదారంగా సహాయపడండి. మీరు పంపే విరాళానికి ఇన్‌కం టాక్స్ 80 (జి) ప్రకారం పన్ను మినహాయింపు ఉంటుంది.
నయీదునియా యాజమాన్యం మరియు ఉద్యోగులు ఈ సహాయ నిధికి రూ5 లక్షలను అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ సహాయ నిధికి తోడ్పడటం ద్వారా మీరు సైతం మీ సామాజిక బాధ్యతలను నెరవేర్చగలరు. సహాయం చేయదలిచినవారు ఈ కింది చిరునామాకు క్రాస్ చెక్‌ను పంపించండి. Naidunia Baadh Rahat Kosh 60/1 Labhchand chajjlani marg Indore (Madhya Pradesh)
మీకు ఏవైనా సందేహాలుంటే, బీహార్ వరద సహాయం అనే సబ్జెక్ట్ లైన్‌తో customer.care@webdunia.net పేరిట ఒక ఇమెయిల్ పంపించండి.
|