సింగూర్ ప్రాజెక్ట్ సమస్యపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తృణమూల్ కాంగ్రెస్‌కు మధ్య కుదిరిన ఒప్పందంపై టాటాలు అసమ్మతిని ప్రకటించిన నేపథ్యంలో సింగూర్ ప్రాజెక్ట్ నుంచి భూమిని వెనక్కు ఇచ్చే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య చెప్పారు. అలాగే టాటా ప్లాంట్ మరియు అనుబంధ సంస్థలను వేరు చేసిది లేదని కూడా స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ ప్రకటన కారణంగా ఈ విషయమై గందరగోళం ఏర్పడిందని బుద్దదేవ్ వివరించారు. భూమిని అమ్మివేసిన వారిని తిరిగి అక్కడికి రప్పించేది లేదని తేల్చి చెప్పారు. కొత్తగా ఏర్పర్చిన 4గురు సభ్యుల ప్యానెల్ మంగళ వారం 12 గంటలకు సమావేశం కానున్నందున ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశముందని బుద్ధదేవ్ పేర్కొన్నారు. అందువల్ల తమ ప్రభుత్వం సింగూర్ ప్రాజెక్టుపై ఆశలు వదులుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.
ప్రాజెక్ట్ భూమిని రైతులకు తిరిగి అప్పగించనున్నారంటూ విభిన్న నివేదికలు వెలుగు చూస్తుండటంతో టాటాలు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రభుత్వానికి విపక్షానికి మధ్య కుదిరిన ఒప్పందం పట్ల ఆ లేఖలో టాటాలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. చర్చల విషయంలో స్పష్టత వ్యక్తం కానందున నానో మోటార్స్ ప్లాంట్‌లో పనిని నిలిపివేయడం కొనసాగుతుందని ప్రకటించారు.
ఈ నేపథ్యంలో సింగూర్ ప్రాజెక్టు భూమిని రైతులకు తిరిగి అప్పగించేది లేదని బుద్దదేవ్ పేర్కొన్నారు.
|