ఢిల్లీ వరుస పేలుళ్ళ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలుసులు రోజురోజుకు పురోగతి సాధిస్తున్నారు. తాజాగా.. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న ఒక విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సిక్కింలోని మణిపాల్ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యాభ్యాసం చేస్తున్న ఈ విద్యార్థిని కర్ణాటక రాష్ట్రంలో అరెస్టు చేశారు. ఢిల్లీ వరుస పేలుళ్ళ అనంతరం కేంద్ర హోం శాఖతో పాటు నిఘా వ్యవస్థపై తీవ్రమైన విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే.
దీంతో మేల్కొన్న నిఘా సంస్థలు, రాష్ట్ర పోలీసు యంత్రాంగాలను అప్రమత్తం చేశాయి. ప్రధాన ప్రాంతాల్లో ఉన్న హోటల్స్, లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ బెంగుళూరులో ఈ విద్యార్థిని అరెస్టు చేశారు. విద్యార్థి వద్ద పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. సిక్కిం క్యాంపస్‌లోని ఎవరైనా విద్యార్థులకు పేలుళ్ళతో సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
|