ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > అమర్‌నాథ్ ఆలయానికి భూముల కేటాయింపు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అమర్‌నాథ్ ఆలయానికి భూముల కేటాయింపు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమర్‌నాథ్ ఆలయ భూముల కేటాయింపుపై జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. ఆలయ బోర్డుకు కేటాయించిన భూములను తిరిగి పునరుద్ధరిస్తూ కాశ్మీర్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతియేటా యాత్రలు జరిగే సమయాల్లోనే భూములను వినియోగించుకునేలా బోర్డుకు అనుతిస్తూ ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అంతేకాకుండా ఈ స్థలంలో తాత్కాలిక నిర్మాణాలు, దుకాణాలు, హెలికాప్టర్ల ల్యాండింగ్, ఆరోగ్య శిబిరాల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సమ్మతించింది. ఇందుకు అవసరైన భద్రతా చర్యలను మాత్రం ఆలయ బోర్డు మాత్రం చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జమ్మూకాశ్మీర్‌లో అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు గత కాంగ్రెస్ సర్కారు భూములను కేటాయించిన విషయం తెల్సిందే. దీనిపై పెద్దదుమారం చెలరేగడం, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం భూములను తాత్కాలికంగా భూములను కేటాయించింది.
మరిన్ని
నానో ప్రాజెక్టుపై నీలి నీడలు: బెంగాల్ కేబినెట్
దక్షిణ ముంబై నుంచి పూనమ్ మహాజన్ పోటీ!
కర్ణాటక అల్లర్లలో భజరంగ్‌దళ్‌ హస్తం: కేంద్రం
మానవబాంబుతో అద్వానీని హతమార్చుతాం
హోం మంత్రి పాటిల్‌పై అమర్ సింగ్ ధ్వజం
గోద్రా అల్లర్లు: గుజరాత్‌ సీఎంకు క్లీన్ చిట్