ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > వీడని నానో వివాదం : టాటాపై మమత చిందులు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వీడని నానో వివాదం : టాటాపై మమత చిందులు
పశ్చమ బెంగాల్ సింగూర్ నుంచి నానో వెళ్లి పోయినా దాని ద్వారా తలెత్తిన వివాదం మాత్రం అప్పుడే సమసిపోయే సూచనలు కన్పించడం లేదు. పారిశ్రామికీకరణ విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కృషికి ఆ రాష్ట్ర ప్రజలు మద్దతు ఇవ్వాలంటూ రతన్ టాటా తాజాగా చేసిన వ్యాఖ్యలు తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కోపం తెప్పించాయి.

రతన్ టాటా చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు మమతా బెనర్జీ పేర్కొన్నారు. పారిశ్రామిక విధానంలో తమ విధానాన్ని తప్పుపడుతూ రతన్ టాటా పశ్చిమ బెంగాల్ ప్రజలకు బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో మమత ఈ ప్రకటన చేయడం గమనార్హం.

కోల్‌కతాలో ఆదివారం ఓ కార్యక్రమం సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు టాటా రాసిన ఈ బహిరంగ లేఖను తీవ్రంగా ఖండించారు. ఈ రకమైన లేఖ రాసినందుకు రతన్ టాటాపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు తాము యోచిస్తున్నామని మమత పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మణిపూర్ సీఎం ఇంటి వద్ద బాంబు పేలుడు
జమ్మూ కాశ్మీర్‌లో ఏడు విడతల్లో ఎన్నికలుః ఇసి
ఢిల్లీలో కూలిన మెట్రో ఫ్లైఓవర్: నలుగురు మృతులు
ఉగ్రవాదం కంటే ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రమాదం
టాటా తర్వాత.. ఇక ఆర్సెలర్ మిట్టల్‌‌ వంతు.!
చంద్రునిపై ఇంధన సంపద: మాధవన్ నాయర్