ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > లోయలో పడిన బస్సు: 20 మంది మృతి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లోయలో పడిన బస్సు: 20 మంది మృతి
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కోటిఘాట్‌ నుంచి రాష్ట్ర రాజధాని సిమ్లాకు వెళుతున్న ఒక బస్సు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు. మరికొందరు గాయపడ్డారు. ఫగు అనే ప్రాంతానికి సమీపంలోని లంభి అనే ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు కొంత మంది ప్రయాణికులతో కూడిన ప్రైవేట్ బస్సు కోటిఘాట్‌ నుంచి సిమ్లాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పారు. గాయపడిన వారిలో ఆరుగురు ప్రయాణికులను ఇంధిరాగాంధీ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"భూమి పుత్రుల" నినాదంతో హాని లేదు: కాంగ్రెస్
మాలేగావ్ పేలుళ్ళకు 'రాజకీయ రంగు'
అఫ్జల్‌పై కాంగ్రెస్‌కు దయ లేదు: అహ్మద్
ఢిల్లీలో రాష్ట్రీయ శివసేన కార్యకర్తల వీరంగం
ఆహార కుంభకోణం: 9 మందిపై ఎఫ్ఐఆర్
ఎన్నికలకు 530 మంది పరిశీలకుల నియామకం