దేశంలో వివిధ కోర్టుల్లో పని చేస్తున్న న్యాయమూర్తుల జీతభత్యాలను కూడా పెంచాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. తమ నెలసరి వేతనాన్ని రూ.1.1 లక్షలకు పెంచాలని తన లేఖలో పేర్కొన్నారు. ఇది సరికొత్త వివాదానికి తెరలేపింది.
అంతేకాకుండా ప్రధానన్యాయమూర్తి తాజా డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రూ.లక్ష, ఇతర హైకోర్టుల్లో పని చేసే వారికి రూ.90 వేలు చొప్పున పెంచాలని ఆయన కోరారు. ప్రధాన న్యాయమూర్తి డిమాండ్‌ను ఆమోదించాలంటే వేతన సవరణ బిల్లును తొలుత కేంద్ర క్యాబినెట్‌లోను, ఆ తర్వాత ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సి వుంది.
ఇటీవలే త్రివిధ దళాధిపతులు కూడా తమకు వేతనాలు పెంచాలని యూనియన్ నేతలుగా అవతారం ఎత్తి కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనికి విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే. తాజాగా న్యాయమూర్తులు కూడా ఇలా డిమాండ్ చేయడం గమనార్హం. |