ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ఉగ్రవాద లింకులపై సైన్యంలో విచారణ: కపూర్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఉగ్రవాద లింకులపై సైన్యంలో విచారణ: కపూర్
FILE
మాలెగావ్ పేలుడు ఘటనకు సంబంధించి సైన్యంలో పనిచేస్తున్న అధికారిని అరెస్టు చేయడంతో భారత సైన్యం ప్రతిష్ట మసకబారింది. భారత దేశపు అత్యంత లౌకిక స్వభావంతో కూడిన ప్రొఫెషనల్ సంస్థ భారతీయ సైన్యం ఇలాంటి పరిస్థితిని పునరావృతం చేయనివ్వనని శపథం చేసింది.

భారతీయ సైనిక చరిత్రలో మొట్టమొదటి సారిగా సాక్షాత్తూ ఆర్మీ ఛీఫ్ తన సైనికులపై అంతర్గత తనిఖీ నిర్వహిస్తామని చెప్పారు. ఈలోగా పేలుళ్లతో సంబంధమున్న లెఫ్టినెంట్ కల్నల్ పురోహిత్‌తో సన్నిహితంగా పనిచేస్తున్న అధికారులను కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది

పురోహిత్‌తో సంబంధంలో ఉన్న 45 మంది సైనికాధికార్లను సైతం ఇప్పటికే అంతర్గతంగా విచారించినట్లు తెలుస్తోంది. సైన్యంలో అంతర్గతంగా తనిఖీలు జరుపుతున్నామని, ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో మరెన్నడూ చోటు చేసుకోకుండా జాగ్రత్త పడతామని భారత్ ఆర్మీ ఛీఫ్ జనరల్ దీపక్ కపూర్ ప్రకటించారు.

మాలెగావ్ పేలుడు ఘటనపై విచారణ క్రమంలో మహారాష్ట్ర పోలీసు విభాగమైన ఉగ్రవాద వ్యతిరేక దళానికి, సైన్యానికి మధ్య తీవ్ర పోరాటం బద్దలయినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా ప్రతిష్టాత్మకమైన భారతీయ సైన్యం కీర్తిపై తొలిసారిగా మచ్చపడింది. అయితే ఇది ఒకానొక విడి ఘటనే తప్ప అంతగా ప్రాధాన్యం లేనిదేనని చెప్పడం ద్వారా సైన్యం తన ప్రతిష్టను నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రాహుల్ గాంధీ చేతల్లో ఒబామా 'మార్పు' మంత్రం
జేడియు ఎంపీల రాజీనామాలు ఆమోదం
త్వరలో "యూనిక్ ఐడెంటిఫికేషన్" కార్డులు
అహ్మదాబాద్ పేలుళ్లు: కీలక నిందితుడి అరెస్టు
అరెస్టు కోసం వేచి చూస్తున్నా: బాల్‌థాక్రే
మార్గరెట్ అల్వా పదవికి ఎసరు తెచ్చిన ఆరోపణలు