ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ఛత్తీస్‌గఢ్‌లో తొలివిడత పోలింగ్ ప్రారంభం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఛత్తీస్‌గఢ్‌లో తొలివిడత పోలింగ్ ప్రారంభం
FILE
ఛత్తీస్‌గఢ్ శాసనసభ తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొదటిదశలో 39 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనుందని ఎన్నికల సంఘం పేర్కొంది. మావోల ప్రాబల్యమున్న బస్తర్, దుర్గ్, రాజ్ నందగావ్ వంటి ఐదు జిల్లాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి రమణ్ సింగ్ (రాజ్ నంద్ గావ్), విపక్ష నేత మహేంద్ర కర్మ (దంతెవాడ)తో పాటు కాంగ్రెస్, భాజపాలకు చెందిన 379 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 39 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఇకపోతే... పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా.. ఎన్నికల సంఘం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా... కేంద్ర పారామిలటరీ బలగాలను పెద్ద ఎత్తున రంగంలోకి దించింది.

మావోల దాడులతో ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి భగ్నం కాకుండా పది హెలికాప్టర్ల ద్వారా భద్రత సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించింది. పోలింగ్ సిబ్బందికి కట్టుదిట్టమైన రక్షణ ఏర్పాట్లు చేసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
చత్తీస్‌ఘడ్‌లో నేడే తొలి విడత ఎన్నికలు
బీజేపీతో చేయి కలిపిన అసోమ్ గణ పరిషత్
మాలేగావ్ పేలుళ్ల కేసు : పోలీస్ రిమాండ్‌కు పాండే
ఫిబ్రవరిలో మోగనున్న ఎన్నికల నగారా... ?
చెన్నై 'లా' కాలేజీలో రగడ : విద్యార్ధులకు గాయాలు
రజనీకాంత్‌తో బీజెపీ నేత అద్వానీ భేటీ