భారత విమానయాన సంస్థ (ఐఏఎఫ్)కు చెందిన మిగ్ విమానాలు కూలిపోవడం అనే సమస్య కొనసాగుతూనే ఉంది. తాజాగా ఐఏఎఫ్‌కు చెందిన మిగ్-23 అనే యుద్ధ విమానం కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఫైలట్లు సురక్షితంగా బయటపడడం గమనార్హం.
పశ్చిమబెంగాల్‌లోని అలీపుర్ దార్ ప్రాంతంలో ఈ మిగ్-23 విమానం కూలిపోయింది. హసీ మరా విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది నిమిషాలకే విమానం ప్రమాదానికి గురయ్యింది. అయితే విమానం కూలినా అందులో ప్రయాణించిన ఇద్దరు ఫైలట్లు క్షేమంగా బయటపడ్డారు.
ప్రస్తుతం కూలిపోయిన మిగ్-23 విమానంతో కలిసి ఈ ఏడాదిలో ఐఏఎఫ్‌కు చెందిన విమాన ప్రమాదాల సంఖ్య ఐదుకు చేరింది. ఐఏఎఫ్‌లో ప్రమాదాల సంఖ్య పెరగడంపై సంస్థ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉత్తర బెంగాల్ ప్రాంతంలోనే మిగ్-21, మిగ్-27 యుద్ధ విమానాలు సైతం కూలిపోయిన విషయంలో తెలిసిందే. |