ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కాశ్మీర్ ఎన్నికలు : తొలి విడతలో భారీ పోలింగ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కాశ్మీర్ ఎన్నికలు : తొలి విడతలో భారీ పోలింగ్
జమ్మూకాశ్మీర్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా సోమవారం పది నియోజక వర్గాల్లో జరిగిన పోలింగ్‌లో భారీ ఎత్తున ఓట్లు పోలయ్యాయి. అధికారుల వివరాల ప్రకారం దాదాపు 55 శాతం మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేసమయంలో చెదురుమదురు ఘటనలు మినహా తొలిదశ ఎన్నికలు దాదాపు ప్రశాంతంగానే ముగియడం అధికారుల్లో ఆనందాన్ని మిగిల్చింది.

పోలింగ్ విశేషాల గురించి ఎన్నికల ప్రధాన అధికారి బీఆర్ శర్మ మాట్లాడుతూ ఉగ్రవాదుల ప్రాబల్యం గల బండిపోరా జిల్లాలోని గురెజ్ నియోజకవర్గంలో అత్యధికంగా 74శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలిపారు. అలాగే మెంధార్‌లో 65శాతం, సురాన్‌కోట్‌లో 58శాతం, కార్గిల్‌లో 57శాతం, నోబ్రాలో 55శాతం, లేలో 53శాతం పోలింగ్ జరిగినట్టు ఆయన పేర్కొన్నారు.

అదేసమయంలో భారీగా పోలింగ్ జరిగే కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన చలి కారణంగా పోలింగ్ శాతం తగ్గిందని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. దీంతో ఎన్నికలు జరిగే చాలా ప్రాంతాలు పోలీసుల, సైన్యం చేతిలో దిగ్భంధంగా మారాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కూలిన మిగ్-23 విమానం : ఫైలట్లు సురక్షితం
మాలేగావ్ పేలుళ్ల కేసు : సాధ్వీకి కస్టడీ పొడిగింపు
పురోహిత్‌ వద్ద హర్యానా రైల్వే పోలీసుల విచరాణ
న్యూఢిల్లీకి చేరుకున్న ఈజిప్టు అధ్యక్షుడు
కంధమాల్ జిల్లాలో పర్యటించనున్న కేంద్ర బృందం
జమ్మూ-కాశ్మీర్‌లో తొలి విడత పోలింగ్ ప్రారంభం