ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ధరలను తగ్గించండి: విత్తమంత్రి విజ్ఞప్తి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ధరలను తగ్గించండి: విత్తమంత్రి విజ్ఞప్తి
chidambaram
FileFILE
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభానికి కుదేలవుతున్న వాణిజ్య రంగాలను ఆదుకునేందుకు వీలుగా స్వదేశీ వస్తువులపై వసూలు చేసే పన్నుల (ఎక్సైజ్ సుంకాలు)ను తగ్గిస్తామని కేంద్ర విత్తమంత్రి పి.చిదంబరం తెలిపారు. అలాగే ఆయా రంగాలు కూడా పెంచిన ధరలను వీలైనంత మేరకు తగ్గించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రపంచ ఆర్థిక ఫోరం, భారత పరిశ్రమల సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో మంత్రి చిదంబరం పాల్గొని ప్రసంగించారు. ఆర్థిక మాంద్యానికి అతలాకుతలం అవుతున్న రంగాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇందులోభాగంగా.. ఆటోమొబైల్, తయారీ, ఉత్పత్తి, రియాల్టీ, ఎయిర్‌లైన్ సంబంధిత వస్తువులు, సేవల ధరలను తగ్గించాలని ఆయన కోరారు.

అలాగే నక్షత్ర హోటళ్ల టారిఫ్‌లు, విమానయాన ధరలు, రియల్ ఎస్టేట్ అపార్ట్‌మెంట్ అమ్మకాలు, గృహాల ధరలతో పాటు నిత్యావసర సరకుల ధరలను తగ్గించాలని ఆయన సూచించారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో దేశం సంతృప్తికరమైన అభివృద్ధి రేటును సాధించగలదనే విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదిలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో కూడా పెరుగుదల కనిపించగలదని మంత్రి చిదంబరం ధీమా వ్యక్తం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
యూపీలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి
చంద్రయాన్-2కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం
కాశ్మీర్ ఎన్నికలు : తొలి విడతలో భారీ పోలింగ్
కూలిన మిగ్-23 విమానం : ఫైలట్లు సురక్షితం
మాలేగావ్ పేలుళ్ల కేసు : సాధ్వీకి కస్టడీ పొడిగింపు
పురోహిత్‌ వద్ద హర్యానా రైల్వే పోలీసుల విచరాణ