ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > దేశంలో 70 శాతం మంది బచ్చాలే: రాహుల్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దేశంలో 70 శాతం మంది బచ్చాలే: రాహుల్
ఈ దేశానికి పట్టిన అదృష్టమో.. లేదా దురదృష్టమో గానీ.. భరతగడ్డపై 70 శాతం మంది బచ్చాలేనని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్.. తనను బచ్చాగా వ్యాఖ్యానించడం పట్ల రాహుల్ తీవ్రంగా స్పందించారు. తాను రాజకీయాల్లో నిజంగానే బచ్చానని సమాధానమిచ్చారు. తనలాగే దేశంలో బచ్చాలుగా ఉన్న 70 శాతం మంది గురించి రాజ్‌నాథ్ సింగ్ వంటి వాళ్లు ఆలోచిస్తే మంచిదని రాహుల్ హితవు పలికారు.

బచ్చా అనే పదాన్ని తాను చాలా భిన్నంగా చూస్తాను. కానీ, ప్రత్యర్థి వారు రాజకీయ కోణంలో చూశారని వ్యాఖ్యానించారు. దేశంలో జరుగుతున్న వరుస బాంబు పేలుళ్లలో భాజపా అనుబంధ సంస్థలకు సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయని, ఈ విషయంపై భాజపా ఆత్మపరిశీలన చేయాలని ఆయన సూచించారు.

ఉగ్రవాదాన్ని కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందన్న భాజపా ప్రధానమంత్రి అభ్యర్థి ఎల్‌కేఅద్వానీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ఈ విషయాన్ని రాజకీయం చేస్తోందన్న భావనతో బీజేపీ ఉంది. కానీ.. తానేం చేస్తుందో ఆ పార్టీ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదని హితవుపలికారు. 1984లో సిక్కులపై జరిగిన ఊచకోత తప్పిదమేనని రాహుల్‌ వ్యాఖ్యానించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అందలమెక్కిస్తే అఫ్జల్‌కు శిక్ష అమలు: భాజపా
బీజేపీ నిధులను పక్కదోవ పట్టిస్తోంది : సోనియా
యువతతోనే రాజకీయాల్లో మార్పు : అద్వానీ
ధరలను తగ్గించండి: విత్తమంత్రి విజ్ఞప్తి
యూపీలో రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి
చంద్రయాన్-2కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం