ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > మహారాష్ట్ర ఉపాధిలో స్థానికులకే పెద్దపీట: గణాంకాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
మహారాష్ట్ర ఉపాధిలో స్థానికులకే పెద్దపీట: గణాంకాలు
ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే అవకాశం కల్పించాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రే గగ్గోలు పెడుతున్న విషయం తెల్సిందే. అయితే మహారాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు మాత్రం స్థానికులకే 90 శాతం ఉపాధి అవకాశాలు కల్పించినట్టు చెబుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం ఉపాధి అవకాశాల్లో మహారాష్ట్ర వాసులకు 90 శాతం ఉద్యోగాలు కల్పించారు.

వీరిలో 1.6 లక్షల మంది సూక్ష్మ, 10.86 లక్షల మంది చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి పొందారు. ఈ సంస్థలో 91 శాతం మంది స్థానికులు నాన్- సూపర్‌వైజరీ, 97 శాతం మంది సూపర్‌వైజర్ పోస్టింగుల్లో నియమితులయ్యారు. భారీ తరహా పరిశ్రమల్లో 88 శాతం మంది నాన్-సూపర్‌వైజర్లుగా, 78.7 శాతం మంది సూపర్‌వైజర్ పోస్టులను మహారాష్ట్రీయులే సొంతం చేసుకున్నారు.

ఇదిలావుండగా.. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌‌ముఖ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ఈ నిజాలను తెలుసుకోకుండా.. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పించాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఇప్పటికైనా రాజ్‌థాక్రే నిజాలు తెలుసుకుని నడుచుకోవాలని ఇతర రాజకీయ పార్టీల నేతలు హితవు పలుకుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కరుణానిధికి జయలలిత లీగల్ నోటీసు
దేశంలో 70 శాతం మంది బచ్చాలే: రాహుల్
అందలమెక్కిస్తే అఫ్జల్‌కు శిక్ష అమలు: భాజపా
బీజేపీ నిధులను పక్కదోవ పట్టిస్తోంది : సోనియా
యువతతోనే రాజకీయాల్లో మార్పు : అద్వానీ
ధరలను తగ్గించండి: విత్తమంత్రి విజ్ఞప్తి