ఛత్తీస్‌గఢ్‌లో గురువారం మలివిడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మొత్తం 51 అసెంబ్లీ స్థానాలకు గాను 687 మంది అభ్యర్ధులు మలి విడత పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నెల 17న ఛత్తీస్‌గఢ్‌లోని 39 అసెంబ్లీ స్థానాలకు తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.
మలివిడత ఎన్నికల బరిలో రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి, ఆయన సతీమణి రేణు జోగితో సహా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విష్ణుదేవ్ సింగ్, డిప్యూటీ స్పీకర్ బద్రీధర్ దివాన్, హోంశాఖ మంత్రి రామ్‌విచార్ నేతమ్, ఆరోగ్యశాఖ మంత్రి అమర్ అగ్రవాల్, మాజీ హోం మంత్రి నందకుమార్ పటేల్ తదితరులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 51 స్థానాల్లో అధికార బీజేపీ, బీఎస్పీలు అన్ని స్థానాల్లో తమ అభ్యర్ధులను బరిలో నిలపగా కాంగ్రెస్ పార్టీ 48 స్థానాల్లో తమ అభ్యర్ధులను పోటీకి నిలిపింది. ఈ పార్టీలతో పాటు ఎన్సీపీ 3, శివసేన 32, గోండ్వానా గణతంత్ర పార్టీ 35, లోక్ జనశక్తి పార్టీ 17, జార్ఖండ్ ముక్తి మోర్చా 14, భారతీయ జనశక్తి పార్టీ 19, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 10, సీపీఐ 18, సీపీఎం ఒక స్థానాల్లో తమ అభ్యర్ధులను బరిలో దించాయి.
పార్టీల నుంచే కాకుండా స్వతంత్రంగా 235 మంది అభ్యర్ధులు మలివిడత పోలింగ్ బరిలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించి గురువారం పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు డిసెంబర్ ఎనిమిదిన జరగనుంది. |