'బిగ్ బాస్ రియాలిటీ షో' ద్వారా మరింత దగ్గరైన నటి మోనికీ బేడిని వివాహం చేసుకోబోనని భారతీయ జనతా పార్టీ దివంగత నేత ప్రమోద్ మహాజన్ కుమారుడు రాహుల్ మహాజన్ స్పష్టం చేశారు. రాహుల్, మోనికా బేడీ 'బిగ్ బాస్ రియాల్టీ షో' పాల్గొని, ఆ తర్వాత వీరిద్దరు షో నుంచి నిష్క్రమించిన విషయం తెల్సిందే. మోనికా తనకిష్టమైన స్నేహితురాలని, తాను ఆమెను పెళ్లి చేసుకోబోనన్నారు.
అయితే.. ప్రతి ఒక్కరూ ఆమెను గౌరవంగా చూడాలని కోరుకుంటున్నానని షో అనంతరం రాహుల్ మీడియా ముందు అన్నారు. ముఖ్యంగా మాఫియా డాన్ అబూ సలేంతో మోనికా విడాకులు తేలాల్సి ఉందన్నారు. మోనికా కూడా చాలా విషయాల నుంచి బయటపడాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ఎల్లవేళలా ఆమెకు సహాయం అందిస్తానని స్పష్టం చేశారు.
తాను రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమని అయితే దానికి ముందు ప్రొడక్షన్ హౌస్‌పై దృష్టి పెడతానని చెప్పారు. సినిమాల్లో నటించాలని తనకు అవకాశాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. కాగా, బిగ్ బాస్ రియాలిటీ షో సందర్భంగా రాహుల్ మహాజన్ మోనికాను పెళ్లి చేసుకోనున్నట్టు ఊహాగానాలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ ఊహాగానాల పట్ల అబూసలేం ఒకింత అసంతృప్తికి గురైనట్టు సమాచారం. |