తాను రాజకీయ రంగ ప్రవేశం చేయబోనని, ఈ జన్మకు ఇదే చాలని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా స్పష్టం చేశారు. ఇటీవల పానిపట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంఘ్ పరివార్ నేతలతో కలిసి ఆయన వేదికపై కనిపించారు. దీంతో బాబా రాజకీయాలకి వస్తారనే ప్రచారం జరిగింది.
దీనిపై ఆయన గురువారం స్పందిస్తూ.. గత రెండు సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు, ప్రత్యక్షంగా లేక పరోక్షంగానైనా మద్దతు తెలుపమని ఆహ్వానాలు పంపుతున్నాయని, కాని ఏ పార్టీలోనూ తాను చేరబోనని స్పష్టం చేశారు. ప్రతి పార్టీలోను ఆదర్శ నాయకులు ఉంటారని వారిని తాను ఎల్లప్పుడూ సమర్ధిస్తానన్నారు. |