సమాజంలోని లంచగొండితనాన్ని నిర్మూలించడానికి యువకులు నడుంబిగించాలని మాజీ రాష్ట్రపతి ఏ.పి.జే.అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. దేశరాజధానిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మనం ఏదైనా పని చేసేటప్పుడు మన అంతరాత్మ మాట వినాలని, యువకులు, పిల్లలు లంచగొండితనాన్ని రూపుమాపడానికి హాంకాంగ్ తరహాలో సంఘటితం కావాలని కోరారు.
40 ఏళ్ళక్రితం వరకు హాంకాంగ్‌లో లంచగొండితనం వేళ్ళూనుకొని ఉడిందని దాన్ని పెకలించడానికి యువత నడుం బిగించిందని తెలిపారు. గొప్పగొప్ప మేధావులు వారి హాంకాంగ్ అనుభవాలను ఈ-మెయిల్ ద్వారా నాతో పంచుకున్నారన్నారు. |