సిక్కులకు వ్యతిరేకంగా 1984లో జరిగిన ఘర్షణలు కచ్చితంగా తప్పేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ చెప్పినా ఆ విషయంలో క్షమాపణ కోరకపోవడాన్ని సిక్కు సంఘాల నేతలు తప్పుబట్టారు. గాంధీ కుటుంబం చేసిన ఈ ఘోర తప్పిదానికి సిక్కు ప్రజలు ఎప్పటికీ వారిని క్షమించరని వారు పేర్కొన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై సిక్కు నేత జ్ఞానీ గుర్బచన్‌సింగ్ మాట్లాడుతూ తన కుటుంబం చేసిన దానిపై రాహుల్ తప్పని పేర్కొన్నా క్షమాపణ మాత్రం కోరలేదని విమర్శించారు. శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు అవతార్ సింగ్ మక్కార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో నాడు జరిగిన దాడుల్లో వందల సంఖ్యలో అమాయక సిక్కులు మరణించారని ఈ విషయాన్ని తాము ఎన్నటికీ మర్చిపోలేమని అన్నారు. ఎస్జీపీసీ మాజీ అధ్యక్షురాలు బీబీ జాగిర్‌ఖౌర్ కూడా వీరితో ఏతిభవించారు. నాడు జరిగిన ఘటనకు కారణమైనవారు శిక్షించబడేవరకు సిక్కులు గాంధీ కుటుంబాన్ని క్షమించబోరని పేర్కొన్నారు. |