దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోందని సరికొత్త వ్యూహాలతో, కృతనిశ్చయంతో ఎదుర్కోకుంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ పతనం గురించి చర్చించేందుకు సమావేశమైన పారిశ్రామికవేత్తలతో అద్వానీ సమావేసం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా అద్వానీ ప్రసంగానికి సంబంధించిన వివరాలను బీజేపీ నేత, మాజీ ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా విలేకరులకు తెలిపారు.
ఆర్థిక మాద్యం గురించి సమావేశమైన సంస్థల సభ్యులు దేశం యొక్క ఆర్థిక పరిస్థితి వేగంగా దిగజారుతోందని చెప్పినట్టు సిన్వా తెలిపారు. ఈ సమావేశంలో దేశంలోని ప్రముఖ సంస్థలైన బజాజ్ ఆటో ఛైర్మన్ రాహుల్ బజాజ్, రిలయన్స్ అధినేతలు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, ఐసీఐసీఐ ఎండీ కామత్, భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్లల్, ఎస్సార్ స్టీల్ ఛైర్మన్ శశి రుయూ తదితలు హాజరయ్యారు. |