ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > రాసిపెట్టి ఉంటే ఏదైనా జరుగుతుంది : లాలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రాసిపెట్టి ఉంటే ఏదైనా జరుగుతుంది : లాలు
తాను ప్రధాని కావాలని నెత్తిన రాసిపెట్టి ఉంటే తప్పకుండా జరుగుతుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి లాలు ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. అదేసమయంలో ప్రధాని కావాలనే ఆశ తనలోనూ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ వేదికగా హిందూస్థాన్ టైమ్స్ పత్రిక శుక్రవారం నిర్వహించిన సదస్సులో లాలూ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పదవిపై తాను ఆశ పడడంలో తప్పేమీ లేదని పేర్కొన్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సైతం బీజేపీకి అధికారం కల్లేనని జోస్యం చెప్పారు.

ఆ పార్టీ నుంచి తప్ప మరేదేని కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎన్నికయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తన పదవీకాలంలో రైల్వేలు రూ. లక్ష కోట్ల టర్నోవర్ సాధించాలని పెట్టుకున్న లక్ష్యం నెరవేరే సూచనలు కన్పించడం లేదని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ప్రస్తుతం కొనసాగుతోన్న ఆర్థిక సంక్షోభమే అందుకు కారణమని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై ధోబి పోటి
సంక్షోభాన్ని అధిగమిస్తాం.. వృద్ధి సాధిస్తాం: ప్రధాని
మాలేగావ్ పేలుళ్ళ నిందితులపై 'మోకా' ప్రయోగం
యురేనియం నిక్షేపాల అన్వేషణకు కృషి: కకోద్కర్
సైనికులూ సెల్‌ వాడకం తగ్గించండి : రామ్‌దేవ్
ఆర్ధిక అత్యవసర పరిస్థితి రానుంది : అద్వానీ