ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > తాజ్ హోటల్ ట్రైనీ చెఫ్‌గా తీవ్రవాది!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
తాజ్ హోటల్ ట్రైనీ చెఫ్‌గా తీవ్రవాది!
యావత్ భారతంతో పాటు.. నక్షత్ర హోటల్స్ యాజమాన్యాన్ని కలవరపెట్టే వార్త తాజ్ ఆపరేషన్‌లో వెల్లడైంది. ముంబయి మారణహోమానికి కారణభూతులైన ఉగ్రవాదుల్లో ఒకరు తాజ్‌ హోటల్‌లో ట్రైనీ చెఫ్‌గా పని చేస్తున్నట్టు సమాచారం. ఇంటర్నెషిప్‌లో గత పది నెలలుగా ట్రైనీ చెఫ్‌గా విధులు నిర్వహిస్తూ.. పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నట్టు వినికిడి.

బయట నుంచి వచ్చిన తీవ్రవాదులతో ఈ ట్రైనీ చెఫ్ చేతులు కలిపి పూర్తి సహకారం అందించాడు. అలాగే హోటల్‌లోని వివిధ అంతస్తులకు చాలా రోజుల నుంచే పేలుడు పదార్థాలను చేరవేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సమాచారాన్ని అధికార, భద్రతా వర్గాలు ధృవీకరించాల్సి వుంది.

అంతేకాకుండా ఈ దాడిని సుదీర్ఘ కాలంగా పాటు సాగించేందుకు వీలుగా ఉగ్రవాదులు సమయాత్తమై వచ్చారు. పాకిస్థాన్‌లోని జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో విధ్వంసం సృష్టంచినట్టుగా తాజ్ హోటల్‌ను పేల్చి వేసేలా మందుగుండు సామాగ్రిని తమ వెంట తెచ్చుకున్నారు.

ముఖ్యంగా భారత్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకే ఈ దురాగతానికి పాల్పడినట్టు సమాచారం. ఈ దాడులకు ఈనెల తొమ్మిదో తేదీన ఉగ్రవాదులు పక్కా పథకం రూపొందించి, అమలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ దాడిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిన విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తాజ్‌ హోటల్‌లో ముగిసిన 'ఆపరేషన్ సైక్లోన్'
ముంబై పేలుళ్ళలో పాక్ హస్తం: ప్రణబ్
భారత్‌కు రానున్న పాక్ ఐఎస్ఐ చీఫ్!
ముంబైలో న్యూస్ ఛానళ్ళ ప్రసారాలు బంద్
పేలుళ్ళ వెనుక లష్కరే-ఇ-తోయిబా హస్తం!
ఎన్‌ఎస్‌జి కమెండోల అదుపులో తాజ్ హోటల్