మూడు నెలల పాటు తమకు లష్కరే-ఇ-తోయిబా సంస్థ శిక్షణ ఇచ్చిందని భద్రతా బలగాలు సజీవంగా పట్టుకున్న తీవ్రవాది అజమ్ అమీర్ అసిఫ్ ఖసాఫ్ వెల్లడించారు. ముంబై ఆపరేషన్‌లో జాతీయ భద్రతా దళం ఒక తీవ్రవాదిని సజీవంగా అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఈ తీవ్రవాది వద్ద భద్రతా వర్గాలు విచారణ జరుపగా పలు ఆసక్తి విషయాలు వెలుగు చూస్తున్నాయి.
తమకు లష్కరే-ఇ-తోయిబా సంస్థ మూడు నెలల పాటు శిక్షణ ఇచ్చిందన్నాడు. వీలైనంత మేరకు ఆస్తి, ప్రాణ నష్టం కలిగించడమే లక్ష్యంగా తమ పథకం రూపొందిందని వెల్లడించాడు. తాజ్ హోటల్ ను పూర్తిగా ధ్వంసం చేయడానికి తగినంత పేలుడు పదార్థాలను సైతం సమకూర్చుకున్నామని చెప్పాడు. ప్రస్తుతం తనకు జీవించాలని లేదన్నాడు. తాము పాకిస్థాన్‌లోని కరాచీ హార్బరు నుంచి ముంబైకు చేరుకున్నట్టు తెలిపాడు. |