|
ముంబై మారణహోమం మృతుల సంఖ్య 195కు పెరిగింది. బాంబు పేలుళ్ళ క్షతగాత్రుల సంఖ్య 300పై చిలుకు ఉన్నట్టు మహారాష్ట్ర అత్యవసర సేవల విభాగం అధికారులు వెల్లడించారు. ఇదిలావుండగా దేశ అంతర్గత భద్రపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏకే.ఆంటోనీ, రక్షణ శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు సమావేశం జరిగింది.
ఇందులో దేశ భద్రతపై సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా తీవ్రవాదం, దేశ భద్రతపై చర్చించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 26వ తేదీన ఉగ్రవాదులు చేసిన దాడి నుంచి అప్రమత్తమైన త్రివిధ దళాలు భద్రతను మరింత అప్రమత్తం చేశారు.
ముఖ్యంగా నావికా, కోస్తా గస్తీదళం శనివారం 15 నౌకలను అదుపులోకి తీసుకుంది. భారత సముద్ర భూభాగంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ నౌకలను అదుపులోకి తీసుకుని నిశితంగా విచారిస్తున్నారు.
|