ముంబై నగరంలో 5 వేలమంది ప్రజలను చంపాలన్న లక్ష్యంతోటే ఉగ్రవాదులు పథకాలు రచించారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్ ఆర్ పాటిల్ చెప్పారు. అయితే ఉగ్రవాదుల దాడుల్లో స్థానికుల పాత్ర ఉందనడానికి ఎలాంటి రుజువులూ లేవని తెలిపారు.కాగా, ముంబై పోలీసులు సజీవంగా పట్టుకున్న ఉగ్రవాది, పేలుడు పదార్ధాలు నిల్వచేయడానికి తాము తాజ్ హోటల్లో గదిని బుక్ చేసుకున్నట్లు ఇంటరాగేషన్‌లో వెల్లడించాడని పాటిల్ చెప్పాడు. తమ వెంట తెచ్చుకున్న సామగ్రితో కనీసం అయిదు వేలమంది ప్రజలను చంపాలని ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.అయితే ఉగ్రవాదులలో ఒకరు గతంలో ఓబెరాయ్ హోటల్‌లో కూడా పనిచేశాడని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. కాగా, తాజ్ హెరిటేజ్ హోటల్‌ను పేల్చివేయాలని కూడా ఉగ్రవాదులు భావించారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. |