ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > అఖిలపక్ష సమావేశానికి ప్రధాని పిలుపు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అఖిలపక్ష సమావేశానికి ప్రధాని పిలుపు
FILE
దేశాన్ని నివ్వెరపర్చిన ముంబై ఉగ్రవాద దాడుల నిరోధక చర్యలు ముగిసిన తర్వాత ఉగ్రవాద వ్యతిరేక చట్టాలను మరింత కఠినతరం చేయడంపై ఏకాభిప్రాయ సాధనకోసం, ఫెడరల్ ఏజెన్సీ స్థాపన కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ ఆదివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఉగ్రవాద చర్యల నిరోధానికి అవసరమైన కఠిన చట్టాల రూపకల్పన విషయంలో దేశంలోని అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయ సాధన తక్షణ అవసరంగా ముందుకొచ్చిందని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలలో కొన్ని అభిప్రాయపడ్డాయి. ప్రధాని ఇప్పటికే ముంబై దాడుల నేపథ్యంలో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని తక్షణం ఏర్పర్చవలసిన అవసరముందని వక్కాణించారు. ఉగ్రవాద దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకోసం ఇలాంటి చట్టాన్ని తక్షణం రూపొందించాలని ప్రధాని పేర్కొన్నారు.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతీయ భద్రతా చట్టాన్ని ఉపయోగించడంతో సహా పలు కఠిన చర్యలను చేపట్టవలసిన అవసరం సమీపించిందని ప్రధాని చెప్పారు. ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ఎన్ఎస్ఎను అమలు పర్చడంతో పాటుగా ఉనికిలో ఉన్న చట్టాలను పటిష్టం చేయవలసిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదని ప్రతిపక్షం కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్న నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు రాజసంగా ముంబై నగరంలోకి అడుగు పెట్టారంటే కేంద్రం అవలంబిస్తున్న మెతకవైఖరి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని బీజీపే సీనియర్ నేత ఎల్ కె అద్వానీ విమర్శించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి: సిడబ్ల్యూసి
త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ
పట్టుబడ్డ ఉగ్రవాదే ఏటీఎస్ ఛీఫ్ హంతకుడు
అయిదు వేలమందిని చంపాలన్నదే లక్ష్యం: పాటిల్
తీరప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
195కు పెరిగిన ముంబై మారణహోమం మృతులు