ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ముంబై స్టాక్ మార్కెట్‌ భవనాన్ని పేల్చేస్తాం: డిఎం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముంబై స్టాక్ మార్కెట్‌ భవనాన్ని పేల్చేస్తాం: డిఎం
వాణిజ్య రాజధాని ముంబైలోని దేశీయ మార్కెట్ భవనాన్ని పేల్చేస్తామని దక్కన్ ముజాహిదీన్ (డిఎం) తీవ్రవాద సంస్థ తాజాగా మరో ఈమెయిల్ బెదిరింపులు చేసింది. అంతేకాకుండా ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా బాంబులతో దహనం చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు గుజరాత్ పోలీసులకు దక్కన్ ముజాహిదీన్ ఈమెయిల్ బెదిరింపును పంపింది.

దీంతో దేశంలోని అన్ని విమానాశ్రయాలతో పాటు.. ప్రభుత్వ కీలక భవనాలకు, ఆలయాలకు భద్రతను మరింత పటిష్టం చేశారు. ముంబై మారణహోమానికి పాల్పడింది తామేనని దక్కన్ ముజాహిదీన్ తొలుత ప్రకటించిన విషయం తెల్సిందే. అయితే ఉగ్రవాదుల ఘాతుకాన్ని దేశ భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈ తీవ్రవాద సంస్థ తాజాగా హెచ్చరించడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మంత్రి పదవికి రాజీనామా చేసిన శివరాజ్ పాటిల్
రాజీనామాకు సిద్ధపడిన హోంమంత్రి పాటిల్?
ఉగ్రవాదులకు ముంబై స్థానికుల సాయం
అఖిలపక్ష సమావేశానికి ప్రధాని పిలుపు
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి: సిడబ్ల్యూసి
త్రివిధ దళాధిపతులతో ప్రధాని భేటీ