ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > కేంద్ర హోం మంత్రిగా పి.చిదంబరం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కేంద్ర హోం మంత్రిగా పి.చిదంబరం
కేంద్ర హోం మంత్రిగా పళనిస్వామి చిదంబరం నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన నిర్వహిస్తున్న కేంద్ర ఆర్థిక శాఖ బాధ్యతలను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అప్పగించనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో లోక్‌సభకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఆర్థిక శాఖ బాధ్యతలను కొత్తగా మరొకరికి అప్పగించేందుకు ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలు నిరాకరించారు.

అందువల్లే విత్తమంత్రి బాధ్యతలను ప్రధాని పర్యవేక్షిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు.. ముంబై బాంబు పేలుళ్ళకు నైతిక బాధ్యత వహిస్తూ.. హోమంత్రి పదవికి శివరాజ్ పాటిల్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే. పాటిల్ రాజీనామాకు ప్రధాని ఆమోదముద్ర వేశారు. దీంతో ఆయన స్థానంలో చిదంబరంను నియమించారు.
వీడియోను వీక్షించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ముంబై స్టాక్ మార్కెట్‌ భవనాన్ని పేల్చేస్తాం: డిఎం
మంత్రి పదవికి రాజీనామా చేసిన శివరాజ్ పాటిల్
రాజీనామాకు సిద్ధపడిన హోంమంత్రి పాటిల్?
ఉగ్రవాదులకు ముంబై స్థానికుల సాయం
అఖిలపక్ష సమావేశానికి ప్రధాని పిలుపు
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి: సిడబ్ల్యూసి