ఛత్తీస్‌గఢ్ భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేతగా రమణ్ సింగ్ తిరిగి ఎన్నికయ్యారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో భాజపా 50 సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో రమణ్ సింగ్ నేతృత్వంలోని భాజపా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. రమణ్ సింగ్ పేరును పార్టీ సీనియర్ నేత బ్రజ్‌మోహన్ అగర్వాల్ ప్రతిపాదించగా, మిగిలిన పార్టీ సభ్యులు ఆమోదించారు.
ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తిరిగి ఎన్నికయ్యే కార్యక్రమానికి భాజపా రాష్ట్ర ఎన్నికల ఇన్‌ఛార్జి రవిశంకర్, పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీ నుంచి వచ్చారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ రెండోసారి ప్రమాణస్వీకారాన్ని శుక్రవారం చేస్తారు.
ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికల్లో అధికార భాజపా 50 సీట్లు సాధించి తిరిగి పాలనా పగ్గాలు చేపట్టబోతోంది. అజిత్ జోగీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆశించిన సీట్లు సాధించలేక రెండోసారి నిరాశాజనక ఫలితాలు చవిచూసింది. |