ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > ఛత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్ సింగ్ ప్రమాణ స్వీకారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఛత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్ సింగ్ ప్రమాణ స్వీకారం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్‌పూర్‌లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు సీనియర్ నాయకుడు విద్యా చరణ్ శుక్లా, మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తదితరులు కూడా పాల్గొన్నారు.

ఇకపోతే... 56 ఏళ్ల రమణ్ సింగ్ రెండో సారి ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి పగ్గాలను చేపట్టడం గమనార్హం. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాభివృద్ధికి తాను తీవ్రంగా కృషి చేస్తానని రమణ్ సింగ్ ఈ సందర్భంగా హామీ చేశారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భాజపా విజయఢంకా మోగించిన సంగతి తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో, అధికార బీజేపీ 50 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ 38 స్థానాలతో సరిపెట్టుకుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఉగ్రవాదంపై అంతర్జాతీయ చట్టం రూపొందించాలి... కలామ్
పాకిస్థాన్‌పై దాడి చేయం కాని... : మంత్రి ప్రణబ్
పాకిస్తాన్ నాటకమాడుతోంది: అద్వానీ ధ్వజం
పాకిస్తానే ముంబై దాడులకు కారణం: చిదంబరం
రిమాండ్‌లోనే అజ్మల్‌ను విచారణ: క్రైం బ్రాంచ్
ఉగ్రవాదం‌పై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సమాయత్తం