ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రమణ్ సింగ్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రమణ్ సింగ్
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, భాజపా పాలిత ముఖ్యమంత్రులు, పలువురు ఎన్డీయే నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా రెండో సారి విజయం సాధించిన విషయం తెల్సిందే.

రాష్ట్రాన్ని అభివృద్ధికి అహర్నిశలు పాటుపడిన రమణ్ సింగ్‌కు ఆ రాష్ట్ర ఓటర్లు మళ్లీ పట్టం కట్టారు. దీంతో భాజపా సీఎల్పీ నేతగా రమణ్ సింగ్‌ను ఎన్నుకున్నారు. ఈ పరిస్థితుల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్, రమణ్‌ సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు.

'చౌర్ వాలే బాబా'గా స్థానికులతో అప్యాయంగా పిలుచుకునే రమణ్ సింగ్.. అణగారిన వర్గాలను ఆకట్టుకునేందుకు మూడు రూపాయలకే కేజీ బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజల మన్నలను పొందారు. ముగిసిన ఎన్నికల ప్రచారంలో ఒక్క రూపాయికి ఒక్క కేజీ బియ్యం పథకాన్ని అమలు చేస్తామని ఓటర్లకు హమీ ఇచ్చారు. దీంతో ఆయనకు రాష్ట్ర ప్రజలు మరోసారి పట్టం కట్టారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రేపు జమ్మూకాశ్మీర్‌లో ఐదో విడత పోలింగ్
తీవ్రవాదానికి వ్యతిరేకంగా ముంబైలో మానవహారం
ఛత్తీస్‌గఢ్ సీఎంగా రమణ్ సింగ్ ప్రమాణ స్వీకారం
ఉగ్రవాదంపై అంతర్జాతీయ చట్టం రూపొందించాలి... కలామ్
పాకిస్థాన్‌పై దాడి చేయం కాని... : మంత్రి ప్రణబ్
పాకిస్తాన్ నాటకమాడుతోంది: అద్వానీ ధ్వజం