కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో భద్రతా దళాలు ఒక విద్యార్థిని కాల్చి చంపాయి. అనుమానాస్పద రీతిలో బ్రిగేడియర్ నివాసంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన మహ్మద్ ముకరం అనే విద్యార్థిని ఆదివారం ఉదయం కాల్చి చంపాయి. బెంగుళూరు విమానాశ్రయం రోడ్డులో ఆర్మీ క్యాంపు ఉంది. ఈ కార్యాలయంలోకి గోడ దూకి వెళ్లేందుకు స్థానిక కళాశాలకు చెందిన విద్యార్థి ప్రయత్నించాడు.
ఈ విషయాన్ని తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది హెచ్చరికలు జారీ చేసినప్పటికీ విద్యార్థి పెడచెవిన పెట్టాడు. దీంతో అతన్ని భద్రతా దళాలు కాల్చి చంపాయి. ముంబైపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని నిశితంగా విచారిస్తున్న విషయం తెల్సిందే. |