భారత సాయుధ బలగాలకు చెందిన 12 వేలమంది సైనికాధికారులకు ప్రధాని మన్మోహన్ నూతన సంవత్సర కానుకగా వేతనాల పెంపు బిల్లును ఆమోదించారు. నెలల తరబడి కొనసాగిన అనిశ్చితి తర్వాత భారతీయ ఆర్మికి చెందిన లెఫ్టినెంట్ కల్నల్స్‌కు వారి సరిసమాన స్థాయి కలిగిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారులను అత్యధిక వేతన కేటగిరీలో ఉంచుతున్నట్లుగా రక్షణ మంత్రిత్వ వర్గాలు తెలిపాయి.గురువారం నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని మన్మోహన్ మంత్రి దీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రతిపాదనను ఆమోదించారు. ఫలితంగా ప్రతి నెలా 12 వేలమంది భారతీయ త్రివిధ దళాల సైనికాధికారుల జీతం కనీసం 12 వేల రూపాయలు పెరగనుందని రక్షణ శాఖ తెలిపింది.అయితే సాయుధ బలగానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్, వారికి సరిసమాన స్థాయి కలిగిన వైమానిక, నేవీ విభాగాధికారులకు కూడా ఈ వేతన పెంపు పథకాన్ని అమలు చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. పౌర అధికారులకు, లెఫ్టినెంట్ జనరల్స్‌కు మధ్య నిర్పహణాత్మక సమస్యలు నెలకొంటాయని ప్రభుత్వం గ్రహించినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులకు వేతన వెంపును ప్రభుత్వం అడ్డుకుంది. |