మధ్యప్రదేశ్ మాజీ ముఖ్కమంత్రి దిగ్విజయ్‌సింగ్‌తోబాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీమంత్రులకు లోకాయుక్త క్లీన్‌చిట్ ఇచ్చింది. దిగ్విజయ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలపై అవినీతి ఆరోపణలు, ఇతర అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో లోకాయుక్త విచారణ చేపట్టింది.
అయితే వీరు ఎలాంటి అక్రమార్కులకు పాల్పడలేదని లోకాయుక్త విచారణలో తేటతెల్లమవడంతో ఆ నాయకులకు లోకాయుక్త క్లీన్‌చిట్ ఇచ్చింది.
దిగ్విజయ్‌తోబాటు హర్వంశ్ సింగ్, జమునా దేవి, ప్యారేలాల్ కన్వర్, ఊర్మిళ సింగ్, రాజేంద్ర కుమార్, రాజా పటేరియా, సత్యదేవ్ కటారే, మహేంద్ర బౌద్ధ్ తదితరులు అధికారంలో ఉన్నకాలంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వీరిని లోకాయుక్త విచారణ చేపట్టింది. |