స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండే ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని మాజీ రాష్టపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులు పెరగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హమీర్‌పూర్‌లో పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో కలాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని, అందులో ప్రతి ఒక్క పౌరుణ్ణి భాగస్వామిని చేయాలని కలాం అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా.. దేశం లోపల, బయట ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయాలని ఆయన సూచించారు. గత యేడాది నవంబరు 26వ తేదీన పాకిస్థాన్‌కు చెందిన పది మంది ఉగ్రవాదులు ఆర్థిక రాజధాని ముంబైపై దాడులు జరిపిన విషయం తెల్సిందే. ఈ దాడితో ప్రపంచం యావత్తు నివ్వెర పోయింది. దాడులను ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి. ఈ నేపథ్యంలో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని భారత్ డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే. |