ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > పాక్‌కు సాక్ష్యాలను అందజేశాం: ప్రణబ్ ముఖర్జీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాక్‌కు సాక్ష్యాలను అందజేశాం: ప్రణబ్ ముఖర్జీ
FileFILE
ముంబై దాడులకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలను పాకిస్థాన్‌కు అందజేసినట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఇకపై పాక్ చర్యలు చేపట్టడమే మిగిలి వుందన్నారు. ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదుల అణచి వేతకు పాకిస్థాన్ గతంలో భారత్‌కు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉండాలని ఆయన మరో మారు ఉద్ఘాటించారు. అలాగే మిగిలిన దేశాల్లోని భారత రాయబారులు, హై కమిషనర్లకు కూడా ఈ సాక్ష్యాలు అందజేసి, ఆయా దేశాల ద్వారా పాక్‌పై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

ఇప్పటికే పాక్‌పై అంతర్జాతీయ ఒత్తిడి ఎక్కువైందని ఆయన చెప్పారు. ఇదిలావుండగా ముంబై దాడులు పునరావృత్తమైన పక్షంలో పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని కేంద్ర హోంమంత్రి చిదంబరం హెచ్చరించారు. అంతేకాకుండా భారత నిఘా వర్గాలు, ఎఫ్‌బీఐ నిపుణులు సేకరించిన ఆధారాలను తీసుకుని అమెరికాకు వెళ్లనున్నారు. వచ్చే వారంలో జరిగే ఈ పర్యటనలో కొత్త అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్, సైనికి చీఫ్‌లతో భేటీ అవుతారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నేడు ముఖ్యమంత్రిగా ఒమర్ ప్రమాణ స్వీకారం
ఎంతకైనా తెగిస్తాం.. ఖబడ్దార్: ప్రధాని హెచ్చరిక
ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయాలి: అబ్దుల్ కలాం
ఆధారాలతో అమెరికాకు హోంమంత్రి చిదంబరం
యుద్ధం సమస్యకు పరిష్కారం కాదు: ప్రధాని
డబ్బుకోసం కాదు...గౌరవంకోసం...