రాష్ట్రంలోని క్రైస్తవ మత ప్రజలకు పూర్తి రక్షణ కల్పించాల్సిందిగా ఒరిస్సా ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఉద్రిక్త ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను మొహరించే పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సమన్వయంగా వ్యవహించాలని కోరారు. గత సెప్టెంబరులో విశ్వహిందూ పరిషత్ నేత లక్ష్మణానంద స్వామి ఆగస్టు 23వ తేదీన హత్యకు గురయ్యాడు. ఈ హత్యానంతరం ఒరిస్సా రాష్ట్రంలో ఘర్షణలు చెలరేగిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి రాష్ట్ర శాంతి భద్రతలను సుప్రీం కోర్టు నిశితంగా పరిశీలిస్తోంది. అంతేకాకుండా ఒరిస్సా రాష్ట్రానికి అదనపు సంఖ్యలో పారామిలిటరీ బలగాలను తరలించాలని గత అక్టోబరు 22వ తేదీన సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం సుప్రీం కోర్టు ఒరిస్సా ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టింది. రాష్ట్రంలోని మైనారిటీ ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వందేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించడం గమనార్హం. |