ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > బెంగాలే నా సొంత ఇల్లు : తస్లీమా
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
బెంగాలే నా సొంత ఇల్లు : తస్లీమా
FILE
తాను భారతదేశానికో లేదా, బంగ్లాదేశ్‌కో చెందినా... ఆ దేశాల ప్రభుత్వాలు ఎక్కడా ఉండనీయటం లేదనీ... అయితే తాను ఎక్కడ ఉన్నప్పటికీ సొంత ఇల్లు మాత్రం పశ్చిమ బెంగాలేననీ వివాదాస్పద స్రీవాద రచయిత్రి తస్లీమా నస్రీస్ స్పష్టం చేశారు.

భారత ప్రభుత్వంగానీ, బంగ్లాదేశ్ ప్రభుత్వంగానీ తనను తమ దేశంలో ఉండనీయమంటూ పదే పదే చెబుతుంటే... ఎక్కడెక్కడో ఆశ్రయం వెదుక్కోక తప్పడం లేదని తస్లీమా వాపోయారు. అయితే తాను ఎక్కడ ఉన్నప్పటికీ బెంగాలే తన సొంతిల్లనీ, ఎక్కడున్నా తిరిగి ఇంటికి వెళ్లేందుకే వేచి చూస్తానని తన మనసులో మాటను బయటపెట్టారు.

ఇదిలా ఉంటే... తస్లీమా రాసిన స్త్రీవాద రచనల పట్ల మత చాంధసవాదులు తీవ్ర వ్యతిరేకతను తెలుపుతూ పలు ప్రదర్శనలు జరపడంతో... ఆమె బంగ్లాదేశ్‌ను, ఆ తరువాత ఇండియాను వదలి వెళ్లాల్సి వచ్చింది. తనకు నివసించేందుకు ఇల్లంటూ లేని సమయంలో.. తనకు ఆశ్రయం ఇచ్చిన, ఇస్తానన్న దేశాలను ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా... 1962, ఆగస్టు 25వ తేదీన బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్‌లో జన్మించిన తస్లీమా... ఆ దేశానికి చెందిన ప్రముఖ రచయిత్రిగా, స్రీవాద మానవ హక్కుల కార్యకర్త మరియు సెక్యులర్ వాదిగా పేరుగాంచారు. తస్లీమా రచయితగా ప్రపంచ ప్రసిద్ధి పొందినప్పటికీ... ముస్లిం చాంధసవాదుల నుంచి ముప్పు ఎదుర్కొని, బంగ్లా నుంచి తప్పించుకుని భారత్‌లోని కోల్‌కతాలో నివాసం ఏర్పర్చుకుంది. అయితే ఆ తరువాత కూడా మత చాంధసులు ఆమెను వదలకుండా... ఆందోళనలు చేయడంతో భారత్ వదిలి విదేశాల్లో తలదాచుకుంటోంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఉగ్రవాదమే పాక్ విధానం: ప్రధాని మండిపాటు
ఉగ్రవాద నిరోధక వ్యూహంపై ముఖ్యమంత్రుల చర్చ
సమ్మెలో 60లక్షల లారీలు: కొనుగోళ్లకు జనం పరుగులు
పాక్ మెడలు వంచాలి: అద్వానీ సూచన
క్రైస్తవ మతస్తులకు రక్షణ కల్పించండి: సుప్రీం
కోల్‌కతాలో కల్తీ సారాకు 14 మంది మృత్యువాత