శనివారం ఉదయం గం. 6.32లకు గౌహతి నుంచి కోల్‌కత్తాకు బయలుదేరిన విమానంలో కొద్దిసేపటికే మంటలు వ్యాపించడంతో పైలెట్ అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలోని సిబ్బందితో సహా 46మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
గౌహతినుంచి కోల్‌కత్తా బయలు దేరిన ఎస్2...361 విమానంలో కాసేపటికే ఇంజన్‌లో మంటలు చెలరేగడంతో పైలెట్ వెంటనే అదే విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసి విమానాశ్రయ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి మంటలార్పారు.
ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగిందేనని, పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంవలన ప్రయాణికులు సురక్షితంగా బయటపడగలిగారని విమానాశ్రయ ఉన్నతాధికారులు తెలిపారు. |