ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > పబ్ సంస్కృతికి మేమూ వ్యతిరేకమే: అన్బుమణి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పబ్ సంస్కృతికి మేమూ వ్యతిరేకమే: అన్బుమణి
FileFILE
దేశంలో నానాటికి పెరిగిపోతున్న పబ్ సంస్కృతికి తాను కూడా వ్యతిరేకమని కేంద్ర ఆరోగ్య, కటుంబ సంక్షేమ శాఖామంత్రి అన్బుమణి రాందాస్ అభిప్రాయపడ్డారు. ఈ సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప (భాజపా), రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (కాంగ్రెస్)లు ప్రకటనలు చేసిన విషయం తెల్సిందే.

ఈ జాబితాలోకి తాజాగా మంత్రి అన్బుమణి కూడా చేశారు. పబ్‌ల సంస్కృతి భారతీయ నైతిక జీవన విధానానికి విరుద్ధమని, ప్రతిపాదిత జాతీయ ఆల్కహాల్‌ విధానం దానికి అడ్డుకట్టవేయగలదని అన్నారు. అయితే పబ్‌లకు వెళ్లే మహిళలపై దాడులు చేయడాన్ని మాత్రం తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు.

అదే సమయంలో దేశంలో పెరిగిపోతున్న పాశ్చాత్య సంస్కృతులకు అడ్డుకట్ట వేసి, హిందూ సంప్రదాయాన్ని కాపాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో జరిగే ప్రమాదాల్లో 40 శాతం మేరకు మద్యం సేవించిన స్థితిలో వాహనాలు నడపడం వల్ల జరుగుతున్నాయన్నారు. ఇలాంటి యువత తమ జీవితాలనే కాక రోడ్డు నడిచి వెళ్లే ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మద్యం సేవించి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయేవారిలో ఎక్కువ మంది 20 ఏళ్ల వయసు వారేననని విషయాన్ని మనం గ్రహించాల్సి ఉందన్నారు. దేశంలో గత ఐదారేళ్లలో మద్యం సేవించే వారి సంఖ్య 60 శాతం మేరకు పెరిగినట్టు ఒక అధ్యయనంలో తేలిందని మంత్రి అన్బుమణి వెల్లడించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రేపు ఆస్పత్రి నుంచి మన్మోహన్ డిశ్చార్జ్?
ఉపహార్ కేసు: అన్సల్ బ్రదర్స్‌కు బెయిల్
మహారాష్ట్ర గవర్నర్‌ను కలువనున్న రాజ్‌థాక్రే
జాతీయ స్థాయి పొత్తులకు కాంగ్రెస్ విముఖత
కర్ణాటకకు మహారాష్ట్ర ఏటీఎస్ బృందం
పార్లమెంట్‌‌కు మరింత కట్టుదిట్టమైన భద్రత