యూపీ మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్ నేత కళ్యాణ్ సింగ్‌తో స్నేహంగా ఉండటం కాంగ్రెస్ - ఎస్పీ పొత్తుకు ప్రమాదం కాబోదని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ అభిప్రాయపడ్డారు. తన కొత్త స్నేహితుని వల్ల తమ పార్టీ సెక్యులర్ విధానాలకు లేదా కాంగ్రెస్ పొత్తుకు ఎలాంటి హాని కలుగబోదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ములాయం సింగ్ బుధవారం లక్నోలో మాట్లాడుతూ.. కళ్యాణ్ సింగ్‌తో ఎస్పీ దోస్తీ కుదుర్చుకోవడాన్ని కాంగ్రెస్‌కు ఇష్టం లేదనే అంశానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయంలో భాజపా, బీఎస్పీ వంటి మత, కులతత్వ పార్టీలు ఏకమయ్యే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. అందువల్ల కళ్యాణ్ సింగ్‌ను ఎస్పీ ఆహ్వానించడాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోవాలని ములాయం సూచించారు. అయితే తమ స్నేహంపై కాంగ్రెస్ అయిష్టమయితే కళ్యాణ్‌తో సింగ్‌తో కలిసి సోనియా గాంధీ వేదికను పంచుకోరన్నారు. అయితే సోనియా తనతో కలిసి వేదికను పంచుకునేందుకు వారికి ఎలాంటి అభ్యంతరం ఉండబోదన్నారు. అందువల్ల కాంగ్రెస్ - ఎస్పీ పొత్తు ఏర్పడటం ఖాయమని తాను భావిస్తున్నట్టు ములాయం స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో భాజపా, బీఎస్పీ నేతల మధ్య చర్చలు జరిపిన తర్వాత పొత్తు కుదుర్చుకోవాలనే నిర్ణయానికి వచ్చారని ములాయం సందేహం వ్యక్తం చేశారు. |