గతంలో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశానని కళ్యాణ్ సింగ్ పేర్కొన్నారు.
ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీనుండి వైదొలగిన తర్వాత ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ముస్లింలు, ఇతరవర్గాల ప్రజలు ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరడంపై నిరసన వ్యక్తపరిచారు.
కళ్యాణ్‌సింగ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరడంపై ఆ పార్టీకి చెందిన నాయకులు కొందరు విముఖత చూపడంపై ఆయన స్పందిస్తూ తాను సమాజ్‌వాదీ పార్టీలో చేరడంపై ముస్లిం సోదరులు, హిందువులనుండి నాకు ఉత్తరాలు, ఫోన్లు, ఈ-మెయిల్స్ వస్తున్నాయని, నా ఈ నిర్ణయం సరైనదేనని వారు పంపిన సందేశాలలో నాకు వెన్నుదన్నుగా నిలుస్తామని సమాచారమున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గతంలో తాను భాజపాలోనున్నప్పుడు చేసిన తప్పిదాలు, అలాగే ముస్లింలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టనని ఈ సందర్భంగా సమాజ్ వాదీ ఎంపీలకు ఆయన భరోసా ఇచ్చారు.
సెక్యులరిజానికి ఎలాంటి సర్టిఫికేట్ అవసరంలేదని, ముస్లింలు భాజపాకు వ్యతిరేకం కాని నాకు కాదని, నేను ప్రజలకు చేసిన సహాయాలే నన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయని ఆయన తెలిపారు.
అలాగే ముస్లిం సోదరులు నేను భాజపాకు రాజీనామా చేసి సమాజ్‌వాదీ పార్టీలో చేరడంపై వారు హర్షం ప్రకటించి నాకు స్వాగతం పలికారని దేశంలో ప్రస్తుతం కుల రాజకీయాలు ఎక్కువైనాయని ఆయన కొత్తరాగాన్ని ఆలపించారు. |