వాలెంటైన్స్‌డే రోజున రామ్ సేన అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్‌కు పింక్ చడ్డీలు బహుమానంగా అందనున్నాయి. గత వారం ఫిబ్రవరి-5న మంగళూరులోని ఒక పబ్‌లో అమ్మాయిలను ఇది మన సాంప్రదాయం కాదని తరిమికొట్టిన రామసేన, ఆ తర్వాత రాబోయే వాలెంటైన్స్‌డేను నిషేధిస్తూ ప్రకటనలు జారీ చేసింది. ఈ వాలెంటైన్స్ డే జరుపుకుంటే వారికి తగిన బుద్ధి చెబుతామనికూడా వారు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ సంఘటనకు దేశవ్యాప్తంగా మహిళల్లో ప్రతీకారం పెరుగుతోంది. పేరు చెప్పడానకి ఇష్టపడని ఓ మహిళ తను అందరినుండి పింక్ కలర్లోనున్న చడ్డీలను సేకరిస్తున్నట్లు చెప్పింది. దేశ వ్యాప్తంగా సేకరించిన ఆ చడ్డీలను వాలెంటైన్ డే రోజున రామ సేన నాయకుడైన ప్రమోద్ ముతాలిక్‌కు పంపనున్నట్లు ఆమె తెలిపారు. ఇప్పటికే తమకు ఇబ్బడిముబ్బడిగా పింక్ చెడ్డీలు చేరినట్లు ఆమె చెప్పారు.
ఇది ఒక రకమైన నిరసలాంటిదని ఈ నిర్ణయానికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని ఆమె తెలిపారు. వారి వారి పట్టణాలలో కలెక్షన్ పాయింట్లను ఉంచినట్లు, ఇందులో కొత్తవి, వాడిన పాత చడ్డీలుకూడా వచ్చి చేరుతున్నాయని ఆమె తెలిపారు.
తాము చూస్తూ ఊరుకోమనీ, అలా చూస్తూ ఉంటే మరో పార్టీ నాయకులు తమపై, తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లే పనులుచేస్తారని వారికి గుణపాఠం చెప్పడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఇవన్నీ సేకరించిన తర్వాత బెంగుళూరులోని రామ సేన ప్రధాన కార్యాలయానికి పంపుతామని ఆమె తెలిపారు. |