వచ్చే లోక్‌సభ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీపీఐ(ఎమ్) కేంద్ర కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమవుతోంది. భవిష్యత్తులో సీపీఐ అనుసరించబోయే విధివిధానాలు, ప్రజలకు చేయదలచిన మేలు తదితర అంశాలతో ఎన్డీఏ, యూపీఏలను తలదన్నే విధంగా మ్యానిఫెస్టోకు ఈ సమావేశంలో తుది మెరుగులు దిద్దనున్నారు.
కాంగ్రెస్, భాజపాలతో ప్రజలు విసిగి పోయారనీ, తృతీయ ప్రత్యామ్నంపై ఆశలు పెట్టుకున్నారని సీపీఐ అధికారి ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ సందర్భంగా సీపీఐ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎస్ రామచంద్రన్ మాట్లాడుతూ... రానున్న లోక్ సభ ఎన్నికల దృష్ట్యా తాము అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చ ఉంటుందన్నారు.
కాగా లోక్‌సభకు పోటీ చేసే 80మంది అభ్యర్థుల జాబితాను సీపీఐ(ఎమ్) ఇప్పటికే విడుదల చేసింది. కాంగ్రెస్, భాజపాలను ఓడించడమే లక్ష్యంగా భావసారూప్య పార్టీలతో పొత్తులపై చర్చలు సాగుతున్నాయని రామచంద్రన్ తెలిపారు. |