ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > అద్వానీకి పెరుగుతున్న ఆదరణ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అద్వానీకి పెరుగుతున్న ఆదరణ
FILE
ప్రపంచవ్యాప్తంగా యంగిస్థాన్ అంటూ భారతదేశాన్ని యువతగా చూడాలనుకుంటున్నారు యువకులు. అలాంటి యువకులు బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా లాల్ కృష్ణ అద్వానీని తమ ఇంటర్నెట్ ద్వారా కూడా అతనిని ఆరాధించేవారు అధికమైనారని సర్వేలు తెలుపుతున్నాయి.

81 సంవత్సరాల వయసు కలిగిన అద్వానీ గత కొన్ని నెలల క్రితం తన సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంలో ఇంటర్నెట్ అనేది మానవ సభ్యసమాజాన్ని మార్చే యంత్రంగా ఆయన ఇంటర్నెట్‌ను అభివర్ణించారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత తమ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపిస్తే ప్రముఖంగా ఇంటర్నెట్, సమాచార వ్యవస్థపై తొలుత దృష్టి పెడతామని ఆయన తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. దేశాభివృద్ధి కొరకు ఇంటర్నెట్‌ను తాను ఎక్కువగా వాడతానని ఆయన తెలిపారు.

దీని ద్వారా లంచగొండితనాన్ని ఎలా నాశనం చేయవచ్చో విపులంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపారు. అలాగే వ్యవసాయం, విద్యనుకూడా అభివృద్ధి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

లోక్‌సభ ఎన్నికలను ప్రకటించిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ప్రచారం కొనసాగించడానికి అధికారికంగా జార్ఖండ్‌లో తొలిరోజున ఆయన ప్రసంగిస్తూ ఇంటర్నెట్ వాడకం, వాటి లాభాలగురించి ఆయన వివరించారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత సమాచార వ్యవస్థ, ఇంటర్నెట్‌పై తాము దృష్టిపెడుతామని దీంతో చైనానుకూడా తమదేశం ఓడించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

నవంబర్ ఎనిమిది 2008న తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా తన సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఇందులో దాదాపు 800 పేజీలు, 250కి పైగా వీడియో క్లిప్పింగులు, నాలుగువేలకుపైగా ఫోటోలున్నాయి. కాగా ఆ వెబ్‌సైట్‌ను వీక్షించినవారు తమ అభిప్రాయాలను అందులో పొందుపరిచారు. ఇందులో అద్వానీని తమ నూతన ప్రధానిగాకూడా వీక్షకులు ఆశిస్తున్నట్లు సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వినూత్న తరహా ప్రచారానికి భాజపా శ్రీకారం
సీపీఐ(ఎమ్) కేంద్ర కమిటీ సమావేశాలు
పాకిస్థాన్ ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం
హోం మంత్రి కర్ణాటక పర్యటన మళ్లీ వాయిదా
ప్రభుత్వం ప్రోత్సహించలేదు: విజయ్ మాల్యా
ఎన్నికల సమరం: కాంగ్రెస్-ఎస్పీ పొత్తు విచ్ఛిన్నం