సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్‌కు మరో షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులపై తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని ప్రకటించింది. ఒకవైపు సీట్ల సర్దుబాటుపై ప్రతిష్టంభన నెలకొని ఉండగా మరోవైపు ఎస్పీ కాంగ్రెస్‌పై వ్యూహాత్మక ఒత్తిడి తెస్తోంది.
సమాజ్‌వాదీ పార్టీ బలంగా ఉన్న 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంపై ఎస్పీ అసంతృప్తితో ఉంది. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ మాట్లాడుతూ... తమ సిట్టింగ్ స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిందనీ, అయితే ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ వారికి దీటుగా జవాబిస్తుందన్నారు.
ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు విషయమై స్పందిస్తూ.. తాము కాంగ్రెస్‌తో సంబంధాలను తెంచుకోవాలని చూడటం లేదన్నారు. కాంగ్రెస్ తమకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే దానికి తామేమీ చేయలేమన్నారు. |