ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > జాతీయ > పొత్తు విచ్ఛిన్నం: భాజపా అత్యవసర భేటీ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పొత్తు విచ్ఛిన్నం: భాజపా అత్యవసర భేటీ
ఒరిస్సాలో అధికార బిజూ జనతాదళ్‌తో చెలిమి వికటించడంతో భారతీయ జనతా పార్టీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆదివారం జరిగే ఈ సమావేశానిక్ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో సహా, అగ్రనేత ఎల్కే అద్వానీ, సెట్రల్ కమటీ ఆఫీస్ బేరర్లు హాజరవుతున్నారు. ఒరిస్సా అసెంబ్లీకి కూడా వచ్చే లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెల్సిందే.

ఈ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటుపై బీజేడీ, భాజపాల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. ఫలితంగా ఇరు పార్టీల మధ్య 11 సంవత్సరాలుగా ఉన్న పొత్తు తెగిపోయింది. ఈ పరిస్థితుల్లో పార్టీ నిర్ణయంపై చర్చించేందుకు భాజపా కేంద్ర కమిటీ సమావేశం కానుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజీవ్ ప్రతాప్ రూఢీ వెల్లడించారు.

అయితే, డెహ్రాడూన్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఎన్డీయే కూటమి అభ్యర్థి ఎల్కే.అద్వానీ ఈ ర్యాలీ ముగించుకుని వీలైనంత త్వరగా ఢిల్లీకి వచ్చి, సమావేశానికి హాజరవుతారు. కాగా, మొత్తం 147 అసెంబ్లీ సీట్లు కలిగిన ఒరిస్సాలో గత ఎన్నికల్లో భాజపా అధిక స్థానాలను డిమాండ్ చేస్తోంది. దీనికి ముఖ్యమంత్రి, బిజెడి అధినేత నవీన్ పట్నాయక్ ససేమిరా అంటున్నారు. ఫలితంగా ఇరు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నమైంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కాంగ్రెస్‌ను ఎదుర్కొంటాం: ఎస్పీ
ఒరిస్సాలో ముగిసిన భాజపా-బీజెడీ స్నేహబంధం
వెంకయ్యా...అలా మాట్లాడకయ్యా : బర్దన్
అద్వానీకి పెరుగుతున్న ఆదరణ
వినూత్న తరహా ప్రచారానికి భాజపా శ్రీకారం
సీపీఐ(ఎమ్) కేంద్ర కమిటీ సమావేశాలు