కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య పొత్తుకు ఇంకా అవకాశాలు ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ వెల్లడించారు. ఆయన ఆదివారం న్యూఢిల్లీలోని ఎస్పీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతో సత్‌సబంధాలు కొనసాగుతాయని చెప్పారు. దీనికి నిదర్శనమే, కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేసే ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపబోమని ఆయన ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ సీట్లకు ఎస్పీ పోటీ చేస్తున్న తెల్సిందే. ఆదివారం మరో ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులను పోటీకి దింపేందుకు చర్చిస్తున్నట్టు చెప్పారు. అయితే, అభ్యర్థుల ప్రకటన పూర్తయిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీతో సత్‌సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు.
ఇదిలావుండగా, కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్న 24 లోక్‌సభ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాల్లో రాంపూర్, ప్రతాప్‌గర్, పర్రూఖ్‌బాద్, సలీంపూర్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. ప్రస్తుతం ఈ స్థానాలకు ఎస్పీ సిట్టింగ్‌లు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. అయితే, ఇరు పార్టీలు మధ్య అగ్రనేతలపై పోటీకి దింపబోమని ప్రకటించారు.
రాయ్‌బరేలిలో సోనియా గాంధీ, అమేథీలో రాహుల్ కాంధీ, మణిపూర్‌లో ములాయం సింగ్ యాదవ్, కన్నుజ్‌లో అఖిలేష్ యాదవ్‌లు పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. కాగా, ఎన్నికల ముందు పొత్తు కుదరకపోయినా, ఎన్నికల తర్వాతనైనా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తామని ములాయం వెల్లడించారు. |